మీడియాతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ తాము చెప్పింది కాదని, నిపుణుల కమిటీలు సూచించాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు... మూడు రాజధానుల అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. శాసన మండలి రద్దుపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదని తెలిపారు. విలువల ఆధారంగా సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. తెదేపా ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరుతామని వచ్చినా...అలాంటి రాజకీయాలు చేయలేమని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు.ఇదీ చదవండి : మండలిలో అడ్డుకున్న బిల్లులెన్ని.. వాస్తవలేంటి..?