ETV Bharat / city

తెలంగాణ: దర్గాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు - sharif Dargah at yellandu

దర్గాలో శ్రీరాముని కల్యాణం ఎప్పుడైనా చుశారా... అవును నిజమే. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో కులమతాలకు అతీతంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో దర్గాలో రామయ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. దర్గా మొత్తం రంగు రంగుల ముగ్గులతో అలంకరించి కొవిడ్​ నింబంధనల నడుమ వేడుక జరిపారు.

sriramanavami in dargah, sriramanavami celebrations in Illandu dargah
దర్గాలో శ్రీరామనవమి వేడుకలు, ఇల్లందు నాగుల్‌మీరా దర్గాలో శ్రీరామనవమి
author img

By

Published : Apr 22, 2021, 7:10 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో.. శ్రీరామనవమి సందర్బంగా స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమం కులమతాలకు అతీతంగా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఈ దర్గాలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. 18 ఏళ్లుగా ఉర్సు మహోత్సవాలు ఘనంగా చేస్తున్నారు. వేడుకలను వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్

దర్గా ఆవరణలో కొంతకాలంగా హిందూ సంప్రదాయ రీతిలో కల్యాణాలు జరుపుతున్నారు. ప్రస్తుతం స్వామి వారి కల్యాణాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ జరిపారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణం మొత్తం రంగు రంగుల ముగ్గులతో అందంగా అలంకరించారు. దేశంలో రోజురోజుకు కరోనా పెరుగుతున్న వేళ.. ప్రజలను కాపాడాలని వేదమంత్రాలతో అర్చకులు, మాలిక్​లు దేవుడిని ప్రార్థించారు.

ఇదీ చూడండి :

కరోనా ఎఫెక్ట్ : అన్నవరంలో అంతరాలయ దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.