కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చినవారి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. కరోనా నిరోధంపై నియమించిన అధికారులతో ఉన్నతస్థాయి అధికారుల భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అందుకు సంబంధించి కలెక్టర్లకు మార్గదర్శకాలు సూచించారు. మండల స్థాయిలో కొందరిని కోవిడ్–19 ప్రత్యేక అధికారులుగా నియమించి.. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక అధికారిని కేటాయించారు.
ఇదీ చదవండి :