ETV Bharat / city

కరోనా కుదిపినా.. తెగువతో ఎదురు నిలిచారు..

కరోనా..ఉపాధిని కూలదోసింది... ఉద్యోగాలను ఊడగొట్టింది... అనేక రంగాలను కుదేలు చేసింది... పలు సంస్థలు మూతపడ్డాయి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా... ఏదో ఒక పనిచేసి బతికేందుకు తెగువ చూపుతున్నారు చాలామంది! తమ స్థాయి, విద్యార్హత వంటివి పక్కన పెట్టి, దొరికిన పనిచేస్తూ ముందుకు కదులుతున్నారు! అద్భుతాలు చేయకపోయినా.. తలెత్తుకొని బతకొచ్చని ధైర్యంగా దారి చూపుతున్నారు!కరోనా తమ జీవితాల్లో సృష్టించిన తాత్కాలిక అగాధాన్ని తమ ఆలోచనలతో భర్తీ చేసిన- శివ, సాహిత్‌, సాయి, తాయారు, అనూష, రవీందర్‌ కథలేంటో చూద్దాం రండి!

కరోనా కుదిపినా.. తెగువతో ఎదురు నిలిచారు..
కరోనా కుదిపినా.. తెగువతో ఎదురు నిలిచారు..
author img

By

Published : Aug 12, 2020, 11:18 AM IST

  • మేనేజర్‌ నుంచి డెలివరీ బాయ్‌గా...

శివ.. హైదరాబాద్‌లోని ఆటోమొబైల్‌ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేసేవారు. నెలకు రూ. 25 వేల వేతనం వచ్చేది. కరోనా ప్రభావంతో శివ పనిచేసే సంస్థకు చెందిన కొన్ని శాఖలు పూర్తిగా మూసి వేశారు. సంస్థలోని ఉద్యోగులను ఒక్కొక్కరిగా తొలగిస్తూ.. వారి సెటిల్‌మెంట్లు దగ్గరుండి చూసిన శివ- రెండు నెలలకు తాను సైతం ఉద్యోగాన్ని వదిలేయాల్సిన పరిస్థితికొచ్చారు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఈఎంఐలు.. తడిసి మోపెడై.. ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంచుకున్న మార్గం.. ఈ కామర్స్‌ సంస్థలు. రెండు వేరు వేరు సంస్థల్లో ఫుడ్‌, గూడ్స్ డెలివరీ బాయ్‌గా చేరారు. పూర్తి స్థాయిలో పనిచేస్తే.. రోజుకు దాదాపు రూ. వెయ్యి వరకు వస్తోంది.

శివ

భేషజాల జోలికి వెళ్లకుండా గట్టిగా కష్టపడితే ఏ పనిలోనైనా సంతృప్తి దొరుకుతుంది.

- శివ

  • తండ్రికి తోడుగా...
సాహిత్‌

పంజాబ్‌లోని జీఎన్‌ఏ విశ్వవిద్యాలయంలో దాదాపు ఉచితంగా సీటు సంపాదించి.. ఇంజినీరింగ్‌ మెకట్రానిక్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న సాహిత్‌ది విజయవాడ. తండ్రి సాయి ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకు రూ.20 వేలు వరకు వచ్చేవి. కరోనా నేపథ్యంలో కళాశాల మూతపడింది. సాహిత్‌ ఇంటికొచ్చేశాడు. తండ్రి ఉద్యోగాన్నీ కరోనా కాటేసింది. రెండు నెలలు ఉద్యోగం కోసం తిరిగిన సాయి చివరికి తనకు సంబంధంలేని మార్కెటింగ్‌ రంగంలో చిన్న ఉద్యోగం సంపాదించారు. నెలసరి ఆదాయం బాగా తగ్గింది. ఖర్చులకు డబ్బు సరిపోట్లేదు. దీంతో తండ్రికి చేదోడుగా నిలిచేందుకు సాహిత్‌ ఇంటర్న్‌షిప్‌లో సభ్యత్వం పొంది.. ఒక సంస్థకు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నారు. రోజుకు రెండు, మూడు గంటలు పనిచేస్తే నెలకు రూ. అయిదు వేలు వస్తోంది. యాప్‌లు రూపొందించే సంస్థతో కలిసి పనిచేయడం వల్ల కొంత అనుభవం సైతం సంపాదించిన సాహిత్‌.. సొంతంగా రెండు యాప్‌లు రూపొందించారు.

  • ప్రాక్టీసు లేదని... వాట్సాప్‌లో వ్యాపారం

చిత్తూరుకు చెందిన అనూష జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. భర్త ప్రైవేటు ఉద్యోగి. నాలుగేళ్ల పాప ఉంది. కరోనా నేపథ్యంలో ఆమె కార్యాలయానికి వెళ్లే వెసులుబాటు లేక అయిదు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కాకినాడ వద్ద ఉన్న ఉప్పాడలో కొంతమంది చేనేత కార్మికులను గతంలో చీరలకోసం వెళ్లినప్పుడు ఆమె కలిశారు. ఆ పరిచయాలను వ్యాపారంగా మలిచారు. వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేసి.. ఆన్‌లైన్‌లో చీరలు అమ్ముతున్నారు. ప్రతి రోజూ చీరల వివరాలను స్టేటస్‌గానూ పెడతారు. తనను సంప్రదించిన వారికి నచ్చిన చీరలు నేతన్నల నుంచి నేరుగా కొరియర్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 50కిపైగా చీరలు అమ్మారు.

అనూష

సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే చీరల వ్యాపారం మొదలుపెట్టా!

- అనూష

  • శిష్యుడి వద్దే పనికి...

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రవీందర్‌ ఎంటెక్‌ చదివారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసేవారు. నెలకు రూ.24 వేలు వేతనం వచ్చేది. కళాశాల మూత పడటంతో ఉపాధి కరవై.. తన సొంతూరుకు వెళ్లిపోయారు. తాను పాఠాలు నేర్పిన విద్యార్థికి చెందిన ద్విచక్ర వాహనాల మెకానిక్‌ షెడ్‌లోనే రోజుకు రూ. నూటయాభై కూలికి సహాయకుడిగా చేరి పని నేర్చుకుంటున్నారు. సొంత మెకానిక్‌ షెడ్‌ పెట్టుకోవాలనుకుంటున్నారు.

రవీందర్‌

ఇకపై మెకానిక్‌గానే నా జీవితాన్ని కొనసాగిస్తా.

- రవీందర్‌

  • ఆన్‌లైన్‌లో అమెరికాకు ట్యూషన్‌

కాకినాడకు చెందిన తాయారు.. నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో పార్ట్‌టైం సంగీతం ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఇంట్లోనూ సంగీతం క్లాసులు చెప్పేవారు.. అంతా కలిపి నెలకు రూ.14వేలు వచ్చేవి. కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరుచుకో వట్లేదు. ఇంట్లో క్లాసులకూ ఎవ్వరూ రావట్లేదు.. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలున్నారు. ఆ కుటుంబ మనుగడకు ఆమె సంపాదించడం కూడా అవసరం. దీంతో తనకు తెలిసిన వారి సాయంతో అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సంగీతం క్లాసులు చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇలా నెలకు రూ. ఆరు వేల వరకు ఆర్జిస్తున్నారు.

పని లేని సమయంలో స్నేహితుల ద్వారా వచ్చిన అవకాశాన్ని చేజారకుండా ఒడిసిపట్టుకున్నాను.

- తాయారు

ఇదీ చదవండి: కొవిడ్ బాధితుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.