ETV Bharat / city

''ఇప్పటికైతే ఆ ఖర్చు మాదే.. తర్వాత బాధ్యత మీదే'' - lv subramanyam

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. నూతనంగా ప్రారంభించనున్న రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను వేగంవంతం చేయాలని సీఎస్ ను జీఎం కోరారు.

ఆర్​వోబీల వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం ఖర్చు మీదే... రైల్వే జీఎంతో సీఎస్
author img

By

Published : Aug 20, 2019, 11:44 PM IST

ఆర్​వోబీల వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం ఖర్చు మీదే... రైల్వే జీఎంతో సీఎస్

రాష్ట్రంలో చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను... సకాలంలో పూర్తి చేసి రైల్వేకు అప్పగిస్తామని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అమరావతి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని రైల్వే జీఎంను కోరారు. ఇప్పటికే చేపట్టిన 17 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో.... అప్రోచ్ రోడ్డులకు సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా... భవిష్యత్తులో ఆర్​వోబీ ల వద్ద ఏర్పాటు చేసే అప్రోచ్ రోడ్ల నిర్మాణ ఖర్చు మాత్రం రైల్వే శాఖనే భరించాలని వారికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి

బందరు పోర్టుపై త్వరలోనే నిర్ణయం: పేర్ని నాని

Intro:AP_GNT_86_20_TDP_GNT_PRISEDINT_GV_ANJ8NEYULU_MEDIA_SAMAVESAM_AVB_AP10038
contributor (etv)k.koteswararao, vinukonda
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ వేదికగా మాట్లాడిన మాటలు ఎంపీ విజయసాయిరెడ్డి ఇ ట్విట్టర్ వేదికగా మాట్లాడిన మాటలు అమరావతి రాజధాని వేరే ప్రాంతానికి తరలించే కుట్ర జరుగుతున్నట్లు వారి మాటల్లోనే అర్థమవుతుందని ఇటీవల పైనున్న రాష్ట్రాల ద్వారా వస్తున్న వరద నీటిని మానిటరింగ్ చేసుకోవడం చేతకాక రాజధాని ప్రాంతమైన కృష్ణా నదిలో కావాలనే నీటి ప్రవాహాన్ని పెంచి తద్వారా వరద ప్రభావంతో రాజధాని ప్రాంతం లోని గ్రామాలు నీట మునిగాయని ఈ ప్రాంతం రాజధానికి అనువైంది కాదని దుష్ప్రచారాన్ని వైకాపా నేతలు చేస్తున్నారని విమర్శించిన మాజీ శాసనసభ్యులు గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వినుకొండ తన నివాసంలో మీడియా సమావేశంలో వెల్లడించారు

Body:నేడు వైకాపా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ వేదికగా రాజధాని పై చేసిన విమర్శలు వారి ప్రభుత్వంలోని పెద్దలు రాజధాని నిర్మాణంపై పునఃసమీక్ష జరుపుతామని చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయని ఇటీవల కురిసిన వర్షాలకు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వరద నీరు ప్రాజెక్టులలో మళ్ళించే అవగాహన లేక రాజధాని ప్రాంతమైన కృష్ణా నదిలో కావాలనే వరద ప్రవాహాన్ని పెంచి రాజధాని గ్రామాలు నీట మునిగాయని అసత్య ప్రచారం చేస్తున్నారు
నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల అనువైన ప్రాంతమని అమరావతి ని రాజధానిగా చేసుకొని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 33 వేల ఎకరాలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టామని అమరావతి ప్రాంతంలో రాజధాని రావడానికి ఇష్టం లేని వైకాపా నేతలు గతంలో ఆ ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టారని విమర్శించారు
వేల మంది ఉద్యోగులు రాజధానిలో ఉద్యోగాలు చేస్తున్నారని ఇప్పుడు రాజధానిని మారిస్తే ఉద్యోగుల పిల్లల చదువుల మాటేమిటి రాజధాని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు మాటేమిటని రాజధాని మార్చే ఆలోచన వైకాపా ప్రభుత్వం మానుకోవాలని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అభిప్రాయపడ్డారు

Conclusion:బైట్: జీవీ ఆంజనేయులు (గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.