ETV Bharat / city

"గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లేకుండా చేశారయ్యా" - sons thrown parents out of home at cherlabhutkur

బతుకంత బాధగా... కన్నీటి ధారగా మారింది వారి జీవితం... శరీరంలో సత్తువ ఉన్నంత కాలం శ్రమించి బిడ్డలను గుండెల మీద ఎత్తుకుని పెంచిన తల్లిదండ్రులకు గూడు కూడా లేకుండా పోయింది... తామూ తల్లిదండ్రులమే అన్న విషయాన్ని మరిచి కనికరం చూపలేదు... తమను కన్నవారు భారంగా భావించారు... వారికోసమే జీవితాన్ని ధారబోశారన్ని కనీస జ్ఞానాన్ని మరిచిపోయి రోడ్డుపై వదిలేశారు. వారి పుట్టుకకు కారణమై... వారికంటూ ఫలానా అని ఓ గుర్తింపునిచ్చిన వారికి నిలువునీడ కూడా లేకుండా చేశారు కసాయి కుమారులు...

parents
తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కుమారులు
author img

By

Published : May 17, 2022, 12:43 PM IST

Updated : May 17, 2022, 2:06 PM IST

'పండుటాకును చూసి... పసరాకు నవ్విందట' అన్న చందంగా తాము కూడా వృద్ధాప్యానికి చేరుతామన్న విషయాన్ని మరిచారు... 'పున్నామ నరకం నుంచి తప్పించువాడు కుమారుడు' అంటారు... కానీ కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు... పుట్టినప్పటి నుంచి పిల్లల భారాన్ని మోసిన తల్లిదండ్రులను... వృద్ధాప్యంలో భారమని భావిస్తున్నారు... తాజాగా తెలంగాణలోని కరీనంగర్​ జిల్లాలో వృద్ధాప్యంలోని దంపతులకు ఇదే పరిస్థితి ఎదురైంది... అపురూపంగా చూసుకోవాల్సిన అమ్మానాన్నలను... రోడ్డుపై విసిరేశారు వారి కొడుకులు...

ఇదీ జరిగింది.... పిల్లలే సర్వస్వమని జీవించిన ఆ తల్లిదండ్రులు... చివరికి రోడ్డుపాలుకాక తప్పలేదు. తెలంగాణలోని కరీంనగర్‌ రూరల్‌ మండలం చెర్లబూత్కూర్‌ గ్రామానికి చెందిన అయిలయ్య, రావమ్మ ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. దాదాపు 90 ఏళ్ల వయసు వీరిది. అయిలయ్య తన ఆరు ఎకరాల భూమిని కుమారులకు పంచిపెట్టారు. ఇల్లు మూడో కుమారుడికి ఇస్తే, అతడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పక్కనే తల్లిదండ్రులకు చిన్న రేకులషెడ్డు నిర్మించారు. కొన్నాళ్లకు అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. వృద్ధాప్య పింఛనుతో జీవించేవారు.

మూడు నెలల కిందట గ్రామ పెద్దలంతా చర్చించి.. దంపతులను కుమారులు ఒక్కొక్కరు నెల రోజుల చొప్పున చూడాలని నిర్ణయించారు. ఆ ప్రకారం వృద్ధులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు కుమారుల వద్ద నెల రోజుల చొప్పున గడిపారు. మూడో కుమారుడు వారిని రానీయలేదు. పెద్ద కుమారుడు తన ఇంటి నుంచి వారి సామగ్రిని బయట పడేయించాడు. దీంతో 20 రోజులుగా వారు స్థానిక సామాజిక భవనంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులను సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చి 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తగు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారును ఆదేశాంచారు.

ఇదీ చదవండి:

Last Updated : May 17, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.