ETV Bharat / city

పల్లె పోరు: పల్నాడులో రాజ్యమేలుతోన్న నిశ్శబ్ధం

గుంటూరు జిల్లా పల్నాడులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎన్నికలెప్పుడు వచ్చినా కొట్లాటలు, ఘర్షణలతో అట్టుడికే ప్రాంతం.. చెదురుమదురు ఘటనలు తప్ప పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎక్కువ గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామాలన్నీ ఒకేమాట.. ఒకేబాటగా నడుస్తున్నాయా.. అసలు ఏం జరుగుతుంది..? బరిలోకి దిగేందుకే రాజకీయ ప్రత్యర్థులు వెనుకాడుతున్న పరిస్థితికి కారణమేంటి? ఇవన్నీ ప్రశ్నలే... వీటికి ఎన్నో కారణాలు.. మరెన్నో కోణాలు.

ఏపీ స్థానిక ఎన్నికలు 2021
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021
author img

By

Published : Feb 8, 2021, 12:11 PM IST

పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నప్పటికీ.. రాజకీయపక్షాల పాత్రను పూర్తిగా విస్మరించలేం. నేతల కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయనేది నిష్ఠూరసత్యం. వర్గవైషమ్యాలు, భావోద్వేగాలు కాస్త ఎక్కువుండే పల్నాటి పల్లెలు.. ఎన్నికలంటే మరింత సున్నితంగా మారుతాయి. సార్వత్రిక ఎన్నికలు చూసినా.. గతంలో మధ్యలోనే ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చూసినా ఇదే పరిస్థితి.

తాజాగా పంచాయతీ ఎన్నికలపై అందరిదృష్టి పడింది. పంచాయతీ ఎన్నికల రెండోదశలో నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలాన్ని కలుపుకుంటే మొత్తం 236 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో మాచర్ల, గురజాల నియోజవర్గాల్లోని 9 మండలాల పరిధిలో 134 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. 13,17 తేదీల్లో పల్నాడులో రెండు విడతలుగా జరిగే ఎన్నికల కంటే.. ఈసారి నామినేషన్ల దాఖలు సమయం నుంచే ఉత్కంత ప్రారంభమైంది. అత్యధిక పల్లెల్లో... ఏకగ్రీవాలే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. పలుకుబడి ఉన్న నేతలు మరింతగా ముందుకెళ్లి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రచారానికి వెనుకంజ..

సాధారణ ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షపార్టీ శ్రేణులు కకావికలం కావడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అసలు పోటీ చేయడానికే వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం నుంచి అభ్యర్థులు పోటీకి దిగడానికే వెనుకడుగు వేస్తున్నారు. అభ్యర్థులపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారని.. గతంలో చేసిన పనులకు బిల్లులు ఆపేస్తామని బెదిరిస్తున్నారని ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బైండోవరు కేసుల పేరుతో బెదిరిస్తున్నారని కొందరు ఆశావాహ అభ్యర్థులు వాపోతున్నారు.

పలు చోట్ల చేదు అనుభవాలు...

నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన ఆశావాహ అభ్యర్థులకు పలుచోట్ల చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అరవపల్లి, అడిగొప్పుల, కరాలపాడు వంటిచోట్ల నామినేషన్ పత్రాలను కొందరు వ్యక్తులు లాక్కోగా.. కొన్నిచోట్ల పోలీసులు రక్షణగా నిలిచి నామినేషన్ వేయించారు. మరికొన్నిచోట్ల అధికారులే వారితో నామపత్రాలను నింపించి తీసుకున్నారు. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం పంచాయతీకి ఏడుగురు నామినేషన్లు.. వేయగా అధికారులు మిగతా ఆరింటిని తిరస్కరించి.. ఏకైక నామినేషన్ చెల్లుతుందని నిర్ణయించారు. అర్థరాత్రి మిగతా ఆరుగురు అభ్యర్థులను పిలిపించి మరీ విషయాన్ని చెప్పడంతో వారంతా అప్పీల్ కు వెళ్లారు. వీటన్నింటికి ముందు నామినేషన్ దాఖలుకు ఇంటిపన్ను ఉండాలనే నిబంధనతో ప్రత్యర్థి పార్టీల మద్ధతుదారులు అల్లాడిపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు ఉద్యోగులు వీటిని నిరాకరిస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

పల్నాడులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల కంటే.. ఎన్ని ఏకగ్రీవాలు నమోదవుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉపసంహరణ గడువు తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి: పల్లెపోరు: ఎవరు ఎంత ఖర్చుపెట్టాలి..? లెక్కల సంగతేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.