ETV Bharat / city

New Judges: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు - కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. జ్యుడిషియల్​ సర్వీసెస్​ నుంచి ఏడుగురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తుండటం, ఇటీవలే జస్టిస్‌ చల్లాకోదండరాం రిటైర్‌ కావడం, జస్టిస్‌ కేశవరావు కన్నుమూయడంతో అక్కడ పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 11కి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కొలీజియం ఒకేసారి ఏడుగురు న్యాయాధికారులకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

New Judges
New Judges
author img

By

Published : Aug 19, 2021, 8:43 AM IST

seven-new-judges
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

సుప్రీం కోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఏడుగురు పేర్లను సిఫార్సు చేసింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం ఈమేరకు నిర్ణయం తీసుకొంది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు సిఫార్సు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తుండటం, ఇటీవలే జస్టిస్‌ చల్లాకోదండరాం రిటైర్‌కావడం, జస్టిస్‌ కేశవరావు కన్నుమూయడంతో అక్కడ పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 11కి తగ్గిపోయింది.

seven-new-judges
seven-new-judges

ఈ నేపథ్యంలో.. కొలీజియం ఒకేసారి ఏడుగురు న్యాయాధికారులకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించి ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరుగుతుంది. అప్పటికీ ఇంకా 24 పోస్టులు ఖాళీగానే ఉంటాయి. ఈ హైకోర్టుకు కేటాయించిన 42 పోస్టుల్లో 28 మందిని న్యాయవాదుల నుంచి, మిగిలిన 14 మందిని రాష్ట్ర జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ నుంచి ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,48,267 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2,11,927 సివిల్‌వి కాగా, 36,340 క్రిమినల్‌వి.

నూతన న్యాయమూర్తుల ప్రస్థానమిది...

జస్టిస్ పి.శ్రీసుధ :

1962 జూన్‌ 6న నెల్లూరులో జన్మించారు. 1992లో న్యాయవాదిగా నమోదై 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కరీంనగర్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా, వ్యాట్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌గా విధులు నిర్వహించారు.

జస్టిస్ సి.సుమలత:

1972 ఫిబ్రవరి 5న నెల్లూరులో జన్మించారు. 1995లో పద్మావతి మహిళా యూనివర్సిటీ (తిరుపతి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రైట్‌ టు టైమ్‌లీ జస్టిస్‌ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. జిల్లా జడ్జిగా 2007లో ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరుల్లో పనిచేశారు. జ్యుడిషియల్‌ అకాడమి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా కొనసాగుతున్నారు.

జస్టిస్ డాక్టర్‌ గురిజాల రాధారాణి:

1963 జూన్‌ 29 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్‌ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.

జస్టిస్ ఎం.లక్ష్మణ్‌:

1965 డిసెంబరు 24న వికారాబాద్‌ జిల్లా వేల్చల్‌ గ్రామంలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జిల్లా జడ్జిగా ఎంపికై మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం కార్మిక న్యాయస్థానం కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

జస్టిస్ ఎన్‌.తుకారాంజీ:

1973 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో జన్మించారు. 1996లో న్యాయవాదిగా నమోదయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2007 జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలో పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా ఉన్నారు.

జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి:

1961 ఏప్రిల్‌ 15న మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1987లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1994 జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లా జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌గా విధులు చేపట్టి అందులోనే కొనసాగుతున్నారు.

జస్టిస్ పి.మాధవిదేవి:

1965 డిసెంబరు 28న హైదరాబాద్‌లో జన్మించారు. గుల్బర్గాలో ఎల్‌ఎల్‌బీ.. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేపట్టారు. 2005లో ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సర్వీసులో చేరారు. ముంబయి, బెంగళూరుల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:

CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.