కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సచివాలయం ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించుకునే అవకాశముందని నివేదించింది. 2004లో ఇదే తరహాలో పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించారని గుర్తు చేసింది. వీలైనంత మేర ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నామన్నారు. కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు అన్ని ఉపకరణాలనూ అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :