రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంతో, స్వేచ్ఛగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు సగభాగం పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ఎస్ఈసీ తెలిపారు.
ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికలు అనే విధంగా కాకుండా, సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయనే స్పూర్తితో అధికారులు చేసిన ఏర్పాట్లు, భద్రత చర్యలను అభినందించారు. మూడోవిడత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలంతా మూడో విడత ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఈసీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి. మూడో దశలో...579 స్థానాలు ఏకగ్రీవం