ETV Bharat / city

ముగిసిన తొలి దశ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నిలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,249స్థానాలకు 19,491 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 32,504 వార్డు స్థానాలకు గానూ...79,799 నామినేషన్లు వేశారు. మొత్తం దాఖలైన నామపత్రాల్లో 2767 నామినేషన్ల వివిధ కారణాలతో తిరస్కరించారు. వీటిలో సర్పంచ్‌ల నామినేషన్లు 1103 ఉండగా...వార్డు సభ్యులవి 1664 ఉన్నాయి.

panchayat elections in ap
ఏపీ స్థానిక ఎన్నికలు
author img

By

Published : Feb 2, 2021, 4:15 AM IST

పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబంధించి నామినేషన్ల పరిశీలన 12 జిల్లాల్లో కొనసాగింది. కొన్నిచోట్ల సక్రమంగా లేని నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4న తుది గడువు కావటంతో ఎవరైనా ఉంటే ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని 14 మండలాల్లో మొత్తం 70 సర్పంచి స్థానాలు, 240 వార్డు స్థానాలకు సంబంధించి నామినేషన్లు తిరస్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని 32 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో 4 పంచాయతీల్లో సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో 4 పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. వైకాపా అభ్యర్థులు దాఖలు చేసిన 3 నామినేషన్లలో కుల ధ్రువీకరణ పత్రం లేని కారణంగా.... వాటిని తిరస్కరించాలని మాజీ ఎమ్మెల్యే సౌమ్య డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వైకాపా అభ్యర్థి సత్య అనంతలక్ష్మి అనర్హురాలని తెదేపా ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్ ను తిరస్కరించారు.నామినేషన్ వెనక్కి తీసుకోవాలంటూ ఓ వాలంటీర్ తన పై ఒత్తిడి చేస్తున్నట్లు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని వార్డు అభ్యర్థి అధికారులకు ఫిర్యాదు చేశారు.ఎన్నికల్లో అధికార పార్టీ దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరులో మండిపడ్డారు.

మరోవైపు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయటంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతులపై చర్చించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి

ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.