ETV Bharat / city

తెలంగాణ: సర్పంచ్​, ఉపసర్పంచ్​ వర్గాల మధ్య ఫైటింగ్ - Sarpanch and vice sarpanch fighting news

ఒకరు సర్పంచ్​​.. మరొకరు ఉపసర్పంచ్​. వారిద్దరూ తెరాస పార్టీకి చెందినవారే. కానీ ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒకరినొకరు దూషించుకున్నారు. అనంతరం ఇరువురి మధ్య గొడవ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తెలంగాణలోని మెదక్ జిల్లా మూత్రజపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

sarpanch fighting
sarpanch fighting
author img

By

Published : Mar 26, 2021, 7:19 PM IST

సర్పంచ్​, ఉపసర్పంచ్​ వర్గాల మధ్య ఫైటింగ్

తమ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన సర్పంచ్​, ఉప సర్పంచ్​ ముష్టిగాతాలకు దిగారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మూత్రజపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్​ సంజీవ్, ఉప సర్పంచ్ వెంకటేష్ పరుష పదజాలంతో దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

సర్పంచ్​, ఉప సర్పంచ్.. వార్డు సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకున్నారు. మురుగు కాలువల నిర్మాణంపై చర్చ చేశారు. ఇందులో వారివురు చెరొకటి నిర్మాణం చేసుకుంటామని తీర్మానించుకున్నారు. దానికి సమ్మతిగా సంతకాలు చేసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అనంతరం ఫిర్యాదు చేసుకునేందుకు కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

పీఎస్​లోనూ..

అక్కడికి చేరుకున్న ఇరువర్గాల వాళ్లు మరోసారి దాడి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గ్రామపంచాయతీలో ముందు నుంచి ఇద్దరికి పడదు. తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఉపసర్పంచి పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సర్పంచ్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వెంకటేష్​ ఆరోపించారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అడగ్గా.. మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.