నివర్ తుపాను కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఇంధనశాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోని మూడు జిల్లాల్లో 151 ప్రత్యేక బృందాలను మోహరించింది. తుపాను కారణంగా ఎస్‌పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థకు రూ.5.07 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపింది. గృహ, తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
మరో రెండు రోజుల్లో అన్ని కనెక్షన్లకు సరఫరా అందించేలా మరమ్మతులు చేస్తున్నారు. తుపాను కారణంగా ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 33 కెవి ఫీడర్లు 261, 11 కెవి ఫీడర్లు 1029, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు 1,238 దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలాచోట్ల సరఫరా పునరుద్ధరించామని, మిగిలిన పనులను త్వరలో పూర్తిచేస్తామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: