రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్న తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో.. చాలా ప్రాంతాలు కోడిపందేలకు అడ్డాగా మారాయి. ఆయా ప్రాంతాల్లో కోళ్లు కాలు దువ్వుతున్నాయి. వీటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ఈ పందేలు నిర్వహిస్తారని అక్కడివాళ్లు చెప్పారు. బెట్టింగు బాబులు జేబులు ఖాళీ చేసుకున్నారు. వీటి నిర్వహణకు అధికారులు, పోలీసులకు సైతం పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు సమాచారం. కోడిపందేలతో పాటు జూద క్రీడలు సైతం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: