వైకాపా నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అండదండలతోనే తన భూమిని సొంత తమ్ముడు కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్మీ అధికారి గపూర్ ఖాన్ ఆరోపించారు. విజయవాడలో మాట్లాడిన గపూర్ ఖాన్... ప్రభుత్వం ఆర్మీ కోటా కింద చీరాలలోని రామకృష్ణాపురంలో తనకు 3.50 సెంట్ల స్థలం ఇచ్చిందని చెప్పారు. అందులో నిర్మించిన ఇంటిని సొంత తమ్ముడైన షేక్ సిద్ధయ్య ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని అన్నారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి అండదండలతోనే తమ్ముడు సిద్ధయ్య ఈ చర్యలకు దిగాడని వివరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ వివాదంపై చీరాల సివిల్ కోర్టులో దావా వేశానని... తీర్పు కూడా తనకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. తనకు సీఎం జగనే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చదవండి