ETV Bharat / city

GANDIKOTA: గండికోట.. పునరావాస కేంద్రాల్లో వసతుల కరవు - latest news of gandikota projec t

పునరావాస కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులకు సీఎం ఇచ్చిన గడువు దాటిపోయింది. ఇంకా కేంద్రాల్లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు. పరిహారమూ పూర్తిగా అందలేదు. అధికార యంత్రాంగం సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం తాగునీరూ లేదు. గులకరాళ్లపైనే నిర్వాసితులు నడుస్తున్నారు. అదీ లేనిచోట చినుకు పడితే బురదరోడ్డే దిక్కు. మురుగుకాల్వల సంగతి సరేసరి. గండికోట పునరావాస కేంద్రాల్లో వసతుల లేమి, నిర్వాసితుల కష్టాలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

gandikota
gandikota
author img

By

Published : Aug 28, 2021, 7:13 AM IST

గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన (ఫేజ్‌-2) వారి కడగండ్లు తీరడం లేదు. కడప జిల్లాలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రణాళిక లేకుండా నీటిని నింపడంతో ఇబ్బందులు తలెత్తాయి. కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రాత్రికి రాత్రి నీరు చుట్టుముట్టడంతో అందరూ కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. నెలలు గడుస్తున్నా అక్కడ కనీస సౌకర్యాలు లేవు. మూడు కేంద్రాల పరిధిలో ఇప్పటికే 60% పైగా నిర్వాసితులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కొందరు ఇళ్లు పూర్తవ్వడంతో అక్కడే ఉంటున్నారు. మరికొందరూ అందుకు సిద్ధమవుతున్నారు. అయినా వసతులు లేవని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాసితులు కొండాపురం మండలంలోని పునరావాస కేంద్రాలకు చేరి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. మూడు గ్రామాల్లో పరిహారం అందనివారు సుమారు 500 మంది ఉన్నారని నిర్వాసితులు చెబుతున్నారు. వీరిలో స్థలాలు కేటాయించినా రూ.7 లక్షల పరిహారం అందనివారు కేంద్రాల్లోనే గుడారాలు, రేకులషెడ్లు వేసుకుని ఉంటున్నారు. మరికొందరు ఇళ్లు బాడుగకు తీసుకుని అద్దె చెల్లించలేక కష్టాలు పడుతున్నారు. ముంపు పరిహారంపై అధికారుల్ని అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ చర్యలతో గండికోట నిర్వాసితులకు ఇబ్బంది కలిగే ఉంటుంది. మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే మన్నించాలి. శ్రీశైలం నిండుగా ఉన్నప్పుడే సీమకు నీటిని తరలించాలనే ఉద్దేశంతో జలాశయాల్లో ఎక్కువ నిల్వచేశాం. నిర్వాసితుల ఇళ్లు ఖాళీ చేయించాం. ఇది కొంచెం కష్టమైనా ప్రభుత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు. మరో రెండునెలల్లో నిర్వాసితుల ఇబ్బందులు పరిష్కరించి వారి ముఖాలపై చిరునవ్వులు వచ్చేలా కలెక్టర్‌ కృషి చేయాలి. - గత డిసెంబరులో కడప జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ వ్యాఖ్యలు

బిల్లులు చెల్లించలేదని పనుల నిలిపివేత

పునరావాస కేంద్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలకు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. వీటికి రూ.100 కోట్ల పైనే ఖర్చుచేయాలి. తాళ్లప్రొద్దుటూరు, చామలూరు ఆర్‌అండ్‌ఆర్‌లో గుత్తేదారులు కొంతమేర సిమెంటు రహదారులు, మురుగుకాల్వలు నిర్మించారు. వాటి బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని రెండు నెలలుగా పనులు నిలిపేశారు. తాగునీటి ట్యాంకుల ఏర్పాటు పూర్తికాలేదు.

ఖననానికి శ్మశాన వాటికలూ లేవు

వందల ఇళ్ల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో బడి, గుడితో పాటు శ్మశానవాటికకు తప్పనిసరిగా స్థలం కేటాయించాలి. చామలూరు, ఎర్రగుడి కేంద్రాల్లో ఇప్పటివరకు శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించలేదు. బాత్రూం గుంతల్లోకి నీటి ఊట వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత ఇసుక మాటే లేదు

పునరావాస కేంద్రాలకు ఇసుక ఉచితమని ప్రకటించిన అధికారులు మొదట్లో కొంతమేర అమలు చేశారు. ఇప్పుడు అసలు అమలే కావట్లేదని వాపోతున్నారు. చామలూరు, ఎర్రగుడి కేంద్రాల్లోని నిర్వాసితులు కొండాపురంలోని ఇసుక రీచ్‌లకు వెళ్లేందుకు వీలుగా ఉన్న సంకేపల్లి-బొందలదిన్నె రహదారి గండికోట వెనుక జలాల్లో మునకకు గురైంది. ఇక్కడ బ్రిడ్జి పనులు నీటిమట్టం కారణంగా ఆగిపోయాయి. ఇక్కడకు ఇసుక తేవాలంటే అనంతపురం జిల్లా తాడిపత్రి, అక్కడినుంచి కొండాపురంలోని రీచ్‌లకు వెళ్లి తీసుకురావాలి. ఇంత భారం భరించలేక ఎడ్లబండ్లలో ఇసుక తరలిస్తున్నారు.

ఉన్నది ఒకచోట... భూములు మరోచోట

చామలూరు, ఎర్రగుడి గ్రామాల రైతులది మరో ఇబ్బంది. ప్రాజెక్టు కింద ఈ గ్రామాల భూములు పూర్తిస్థాయిలో మునగలేదు. చామలూరులో 100 ఎకరాలు, ఎర్రగుడిలో 250 ఎకరాలను అధికారులు ముంపుగా పరిగణించలేదు. పునరావాస కేంద్రాల నుంచి వారి భూములకు 4-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడకు వెళ్లాలంటే నీరు అడ్డుగా ఉంటోంది. రైతులు చుట్టూ తిరిగి 12-15 కిలోమీటర్లు వెళ్తున్నారు. కల్వర్టు నిర్మిస్తే సాగుకు వీలుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.

ఉపాధి కరవు

ఊరు వదిలేసి పునరావాస కేంద్రాలకు చేరిన నిర్వాసితులు ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు. కూలికి వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు కాంక్రీటు పనులకు వెళుతున్నారు. ఉపాధి పనుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు.

పునరావాస కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి రూ.200 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరాం. మెజార్టీ నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించాం. సకాలంలో రాకుండా, సరైన ఆధారాలు సమర్పించని కొందరివే పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి 120 మందికి రూ.60 కోట్లే ఇవ్వాలి. మౌలికవసతుల పనులు కాస్త మందగించాయి. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. - గౌతమి, జేసీ (రెవెన్యూ), కడప జిల్లా

నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వివరాలు

ఏకమొత్తం పరిహారం (ఓటీఎస్‌): రూ.10 లక్షలు

పునరావాసం కోరుకుంటే: రూ.7 లక్షలు+ 5 సెంట్ల స్థలం

2017 సెప్టెంబరు 30 నాటికి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ పైవాటిలో కోరుకున్న పరిహారం అందిస్తారు.

నేను ఎర్రగుడి సర్పంచిని. మా గ్రామంలో అన్నీ సమస్యలే. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, నీటివసతి, ఉపాధి లేదు. తాడిపత్రికి వెళ్లే రస్తా తప్ప కేంద్రానికి మూడువైపులా నీరే. అందరం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. - లక్ష్మీనారాయణరెడ్డి, ఎర్రగుడి

ప్రభుత్వం నాకు స్థలం కేటాయించి రూ.7 లక్షలు ఇచ్చింది. ఇంటికి రూ.9 లక్షలు అయ్యాయి. మెడలోని బంగారుదండ అమ్మి ఇల్లు పూర్తిచేసుకున్నాం. మేం ఏం తిని బతకాలి? చాలా ఇబ్బందిగా ఉంది. ముగ్గురు మనవరాళ్లకు ఇంకా చెక్కులు రాలేదు.- పెద్దక్క, తాళ్లప్రొద్దుటూరు

దగ్గర్లో ఇసుక రీచ్‌ లేక ఇబ్బంది పడుతున్నాం. ఉచితంగా ఇసుక అని చెప్పి ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇసుక ధర భరించలేక కొట్టం వేసుకున్నాం. గ్రామంలో ఇంకా రోడ్లు వేయలేదు. వర్షం కురిస్తే బురదగా మారి నడిచేందుకూ ఇబ్బందిగా ఉంది.- బాషా, చామలూరు

ఇదీ చదవండి: home minister reservation: హోంమంత్రి రిజర్వేషన్​పై ఎస్సీ కమిషన్ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.