ETV Bharat / city

పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్‌ పనులేమీ మొదలు కాలేదు: సీఎస్‌ - ఏపీ తాజా వార్తలు

పోతిరెడ్డిపాడు వద్ద కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణ పనులను నిలువరించాలని కోరుతూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో దాఖలుచేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పుబట్టింది. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్‌ పనులేమీ మొదలుకాలేదని ఎన్‌జీటీకి ఏపీ సీఎస్‌ తెలిపారు.

pothireddy
pothireddy
author img

By

Published : Feb 3, 2021, 8:03 AM IST

ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే పోతిరెడ్డిపాడు వద్ద కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణ పనులను నిలువరించాలని కోరుతూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో దాఖలుచేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పుబట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా తాము ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుల వద్ద లిఫ్టు ఇరిగేషన్‌ పనులు చేపడుతున్నట్లు చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఎన్‌జీటీ ముందు తాజాగా అఫిడవిట్‌ సమర్పించారు. ప్రస్తుతం అక్కడ డీపీఆర్‌ తయారీకోసం ముందస్తు పరిశీలన జరుగుతోందే తప్ప నిర్మాణపనులు ప్రారంభమే కాలేదన్నారు. ఇంకా రాయలసీమ ఎత్తిపోతల డిజైన్లనే ఖరారు కాకుండా పనులు ప్రారంభించడం ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

‘‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాల ఎంపిక కోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్లకు ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అందువల్ల సంబంధిత అధీకృత సంస్థ నుంచి అనుమతులు రాకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడం సాధ్యంకాదు. సంగమేశ్వరం వద్ద భారీ యంత్రాలు, వందలాది ట్రక్కులు మోహరించి పనులు చేపడుతున్నట్లు చెప్పడం పూర్తిగా నిరాధారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పంపులు ఏర్పాటుచేయడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. అందువల్ల అక్కడ భౌగోళిక పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టాం. అందుకు ఎన్‌జీటీ అనుమతులు కూడా ఉన్నాయి’’ అని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్‌జీటీకి సమర్పించిన తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం ఈకేసుపై చెన్నై ఎన్‌జీటీ బెంచ్‌ ముందు విచారణ జరిగింది. అయితే ఏపీ తరుఫు న్యాయవాది విజ్ఞప్తితో కేసును వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.