ETV Bharat / city

రాజ్​భవన్​ వెబ్​సైట్ ప్రారంభించిన గవర్నర్ - రాజ్​భవన్ వెబ్​సైట్ లాంచ్

రాజ్​భవన్ సేవలు.. సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ వైబ్​సైట్​ను రూపొందించారు. ఈ వెబ్​సైట్​ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ప్రారంభించారు. వెబ్​సైట్​లో ఇ-విజిటర్, ఇ-మెసేజ్, ఇ-గ్రీవెన్స్ విభాగాలు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. రాజ్​భవన్ రోజువారి సమాచారాన్ని వెబ్​సైట్​లో ఉంచుతామని గవర్నర్ కార్యదర్శి వెల్లడించారు.

Rajbhavan web launch
రాజ్​భవన్​ వెబ్​సైట్ ప్రారంభిస్తోన్న గవర్నర్
author img

By

Published : Dec 23, 2019, 9:19 PM IST

రాజ్​భవన్​ వెబ్​సైట్ ప్రారంభిస్తోన్న గవర్నర్
రాష్ట్ర ప్రజలకు రాజ్‌భవన్‌ సేవలు మరింత చేరువ చేసేందుకు కొత్తగా రూపొందించిన వెబ్​సైట్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభించారు. రాజ్​భవన్‌ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షణలో వెబ్​సైట్​ను రూపొందించారు. వెబ్‌సైట్‌లోని ఇ-విజిటర్ సదుపాయం ద్వారా గవర్నర్‌ను కలవాలనుకునే సందర్శకుడు ఆన్​లైన్‌లో తన వివరాలను నమోదు చేసుకోవచ్చు. రాజ్​భవన్ వాటిని పరిశీలించిన నమోదుదారుకు సమాచారం పంపుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ఇ-మెసేజ్ ద్వారా గవర్నర్ సందేశాన్ని పొందటానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, ఇ-గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులను సైతం సమర్పించవచ్చని వెల్లడించారు. వెబ్‌సైట్‌లో గవర్నర్ ప్రసంగాలు, కార్యక్రమాలతో ఫొటో గ్యాలరీ, ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. రోజువారీ ప్రాతిపదికన రాజ్​భవన్ అధికారులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్​సైట్​లో ఉంచుతారని అధికారులు చెప్పారు. రాజ్​భవన్ గౌరవాన్ని పెంచేలా వ్యవహరించాలని గవర్నర్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్​భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ను http://governor.ap.gov.in/ లేదా http://rajbhavan.ap.gov.in/ ద్వారా సందర్శించవచ్చని గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.