కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి స్వర్ణభారతి ట్రస్టుకు వెళ్లారు.
మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ కళాశాల ప్రథమ సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం బాపులపాడు మండలం వీరవల్లిలోని ఏబీసీ సేమేన్ స్టేషన్ పరిశీలిస్తారు. అనంతరం రాజధాని ప్రాంత రైతులు ఉప రాష్ట్రపతిని కలిసి తమ పరిస్థితులను వివరించనున్నారు. 25వ తేదీ ఉదయం స్వర్ణభారతి ట్రస్టులో వైద్య శిబిరం ప్రారంభిస్తారు. అనంతరం పద్య వైభవం కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్