ETV Bharat / city

ఉపరితల ఆవర్తన ప్రభావం..రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు - rains in rayalaseema

Weather Update: దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనంతో రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

rains
rains
author img

By

Published : Aug 30, 2022, 7:13 PM IST

Rains in Andhra Pradesh: దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఇది ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకూ మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసినట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపటి వరకు రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.