ETV Bharat / city

ఏపీ వైఖరి వల్ల రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర వ్యయభారం: రైల్వే మంత్రి

author img

By

Published : Mar 17, 2021, 9:00 PM IST

యలహంక-పెనుకొండ డబ్లింగ్‌ రైల్వే లైన్‌ పురోగతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. డబ్లింగ్‌ ప్రాజెక్టులో 72 కి.మీ రైల్వేలైన్‌ పూర్తి అయిందని స్పష్టం చేశారు. రైల్వే లైన్‌ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మధ్య వస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ కొంత మేర భరిస్తామని చెప్పినప్పటికీ... తరువాత ఇవ్వలేమని చెప్పిందన్నారు.

yelahanka penukonda doubling line
yelahanka penukonda doubling line

యలహంక-పెనుకొండ డబ్లింగ్‌ రైల్వే లైన్‌ పురోగతిపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్​సభలో ‌ప్రశ్నించారు. ఇందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 120 కి.మీ మేర డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ.1,147 కోట్ల అంచనాలు రూపొందించామని తెలిపారు. డబ్లింగ్‌ ప్రాజెక్టులో 72 కి.మీ రైల్వేలైన్‌ పూర్తి అయిందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.912 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2021-22 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.160 కోట్లు కేటాయింపులు జరిపామన్నారు. రైల్వే లైన్‌ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మధ్య వస్తుందని వివరించారు.

తమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టులో 50శాతం భరిస్తామని ఏపీ చెప్పిందని మంత్రి పీయూష్‌ గోయల్ ప్రస్తావించారు. ఏపీ తన వాటాలో రూ.200 కోట్లకు గాను రూ.50 కోట్లే ఇచ్చిందని ప్రస్తావించారు. అనంతరం ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా ఇవ్వలేమని చెప్పిందని పేర్కొన్నారు. ఏపీ వైఖరి వల్ల రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర వ్యయభారం నెలకొందని చెప్పారు. ఈ మేరకు సొంత నిధులతో ప్రాజెక్టు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించిందని వెల్లడించారు.

ఇదీ చదవండి

వింతవ్యాధికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు: ఎంపీ గల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.