ETV Bharat / city

AP-TS Water War: ఇటు పులిచింతల.. అటు సాగర్: జలజగడంతో భారీగా భద్రత పెంపు

పులిచింతల ప్రాజెక్టు నుంచి విధివిధానాలకు భిన్నంగా తెలంగాణ అధికారులు జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని వినియోగించి దిగువకు వదిలేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా పులిచింతల ప్రాజెక్టు వద్ద పోలీసుల భారీగా మోహరించారు.

pulichintala
pulichintala
author img

By

Published : Jul 1, 2021, 9:36 AM IST

Updated : Jul 1, 2021, 12:22 PM IST

పులిచింతల ప్రాజెక్టు వద్ద భారీగా భద్రత పెంపు

కృష్ణా బేసిన్ లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం నెలకొన్న వేళ..ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి.. డ్యామ్ లు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద రాష్ట్ర పోలీసులను మోహరించారు. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం.. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదనను చేస్తోంది. తక్షణమే విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని రాష్ట్రం డిమాండ్‌ చేసింది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలూ రాసింది. ప్రాజెక్ట్ కు ఇరువైపులా.. అటు తెలంగాణ, ఇటు ఏపీ పోలీసులను మోహరించారు. సాగర్ బ్రిడ్జి వద్ద వాహనాలను తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టు వద్ద సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా పోలీసుల్ని ప్రాజెక్టు ప్రాంతంలో కాపలాగా ఉంచారు. రెండు రోజుల క్రితం విద్యుదుత్పత్తి ప్రారంభించిన తెలంగాణ జెన్ కో అధికారులు.. ఈ విషయంపై కనీసం రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ప్రాజెక్టులో నీరు సగం కూడా నిండకుండానే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించటంపై పులిచింతల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణా జెన్ కోకు లేఖ రాశారు. అయినప్పటికి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 21 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 36 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తోంది. ప్రాజెక్టు ప్రాంతంలోకి సందర్శకుల్ని నిలిపివేశారు. కేవలం ఉద్యోగులను మాత్రమే పంపిస్తున్నారు. జల వివాదం నెలకొన్న తరుణంలో ఉద్రిక్తతలు పెరగకుండా భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

సాగర్‌ డ్యాం వద్ద పటిష్ఠ బందోబస్తు

నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో డ్యాం, విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్‌హౌస్‌లోకి అనుమతించడం లేదు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 100 మంది ఎస్‌పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌, రిజర్వు బలగాలు ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నారు.

ప్రస్తుతం సాగర్‌లో 176.2 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతూ 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీ సరిహద్దు అయిన సాగర్‌ బ్రిడ్జి వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు.. సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్దా సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి. జూరాల ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది. భారీగా పోలీసుల గస్తీ కాస్తున్నారు. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్ హౌస్ లోకి పోలీసులు అనుమతించడం లేదు. జూరాల ఆనకట్టపై రాకపోకలను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు.

ఇదీ చదవండి:

POLAVARAM: పోలవరం నిర్వాసితులకు అదనపు ఆర్థిక సాయం

Last Updated : Jul 1, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.