రాజధాని అంటే వేసుకున్నాక తీసిపారేసే చొక్కా కాదని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజధాని మునగాలంటే విజయవాడ మునగాలని... అది జరిగే పని కాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజధాని విషయంలో ప్రకటన చేసిన తర్వాత తమ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి లేఖ రాసినా.. స్పందన లేదని అన్నారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం సహజమేనని... మంత్రి బొత్స సత్యనారాయణ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో తనకెలాంటి ఆస్తుల లేవని స్పష్టం చేశారు.
ఇదీచదవండి