Spinning Industries: పత్తి ఆధారిత నూలు మిల్లులకు రాష్ట్రం పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా 128 స్పిన్నింగ్ మిల్లులుండంగా..వార్షిక టర్నోవర్ 13వేల కోట్లు. ఉత్పత్తి చేసే నిల్వల్లో 50 శాతానికిపైగా ఎగుమతి వాటా ఉంది. అందులోనూ 80 శాతం చైనాకే ఎగుమయ్యేవి. ఇప్పుడు చైనాకు భారీగా ఎగుమతులు నిలిచిపోవడం వల్ల స్పిన్నింగ్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముడిపత్తి ధర 6 వేల నుంచి 12 వేలకు పెరగ్గా.. దూది క్యాండిల్ ధర 50వేల నుంచి లక్ష రూపాయలకు చేరింది. ఇలా స్పిన్నింగ్ మిల్లులపై ఆర్థికభారం ఉండగా ప్రభుత్వ పవర్ హాలీడే నిర్ణయంతో పెద్ద పిడుగే పడింది. ఉత్పత్తి దాదాపు సగానికి పడిపోయింది.
విద్యుత్తు కోతలు వేధిస్తున్నా జనరేటర్లు వినియోగించేందుకూ పరిశ్రమల యజమానులు సాహసించడంలేదు. రెండు, మూణ్నెళ్లలో కోతలు మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
" పవర్ హాలిడేకు ఎవరూ సిద్ధంగా లేరు. గత 15 సంవత్సరాల నుంచి ఇంత వరకు పవర్ కట్లు చూడలేదు. 1984-85లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మనం పవర్లో ఇప్రూ అవుతూ వచ్చాం. దాని వల్ల పరిశ్రమలు బాగానే నడిచాయి. ఏ పరిశ్రమ కూడా జనరేటర్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. జనరేటర్లు ఒక్క లైటింగ్ కోసమే పెట్టుకుంటారు. పవర్ కట్ వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోమో రెండు మూడు నెలల్లో ఇంకా ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం కన్పిస్తోంది."- మనోహర్, స్పిన్నింగ్ పరిశ్రమ నిర్వాహకుడు
Spinning Industries: పవర్ హాలీడేతో స్పిన్నింగ్ మిల్లులతోపాటు...జిన్నింగ్, వస్త్రాలు తయారుచేసే టెక్స్‌టైల్, ఫ్యాబ్రిక్ పరిశ్రమలపైనా ప్రభావం కన్పిస్తోంది. ఎగుమతి దాదపు సగానికే పరిమితమైంది. కార్మికులకు ఉపాధీ కరవైంది. పవర్ హాలీడే ప్రకటించిన ప్రభుత్వం...వారికి భృతి కల్పించాలని కార్మికసంఘాలు కోరుతున్నాయి.
" సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా కేవలం 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పడంతో... మూడు షిప్టులు నడిచే పరిశ్రమల్లో రెండు షిప్టుల్లో మాత్రమే పని జరుగుతోంది. మూడో షిప్టు సంబంధించి కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుస్తు అంచనాలు లేకుండా, ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. నష్టపోతున్న కార్మికులకు పవర్ కట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం"- లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
ఇదీ చదవండి: Power Cuts In Nellore: వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా!