ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు... భారీగా అక్రమ మద్యం పట్టివేత - అనంతపురం తాజా సమాచారం

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. పట్టుబడిన అక్రమ మద్యాన్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేశారు.

Police conducted illegal liquor inspections across the state
రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు... అక్రమ మద్యం పట్టివేత...
author img

By

Published : Feb 10, 2021, 10:36 PM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు నిఘా పెంచారు. వివిధ జిల్లాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో.. అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లాలో..

లారీలో అక్రమంగా తరలిస్తున్న 1080 మద్యం సీసాలను ఆనందపురం మండలం గండిగుండం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారంతో ఇనుము లోడు లారీని, షిప్ట్ కారును గండిగుండం పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. రెండు వాహనాల్లో అక్రమ మద్యం సీసాలను గుర్తించిన పోలీసులు వాటితో పాటు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. నిందితులు మద్యాన్ని ఒడిసా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా..

క్రోసూరులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో అక్రమ మద్యం రవాణా జరుగుందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏడు గోతాల్లో తరలిస్తున్న 2400 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారణ చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన హేమ కుమార్ ఎవరికీ అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సులో మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న148 మద్యం సీసాలను పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద చేపట్టిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.14,060 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నారు.

అనంతపురం జిల్లాలో..

కర్నాటక నుంచి ఏపీలోకి అక్రమ మద్యం రవాణాపై ఆంధ్ర, కర్నాటక పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 600 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన వారం రోజుల్లో రూ.10 లక్షల విలువైన.. 6 వేల టెట్రా ప్యాకెట్ల కర్నాటక మద్యాన్ని పట్టుకున్నట్లు సబ్ ఎక్సైజ్ సూపరిండెంట్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.