డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 10 వేలమంది సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో బెల్లం ఊట, నాటుసారా నిల్వలను ధ్వంసం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లిలో 60 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్త దాడులు నిర్వహించారు. సుమారు 200 మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. గుడుపల్లె, నగరి, కలికిరి, పాలసముద్రం, విజయపురం, కార్వేటినగరంలోని నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. 12 వేల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పూర్తిగా మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం బంద్