POCSO Court in Jangaon : తెలంగాణలో గిరిజన తెగలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాతో పాటు జనగామలో పోక్సో కోర్టుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. లైంగిక దాడులకు గురైన బాలికల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేసు విచారణలో భాగంగా న్యాయస్థానాల్లో హాజరయ్యే చిన్నారులు, వారి తల్లిదండ్రులు బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
POCSO Courts in Telangana : కోర్టు బయట, లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. విచారణకు ప్రత్యేక గదులున్నాయి. సందేశాత్మక చిత్రాలు అందంగా తీర్చిదిద్దారు. బాధితులకు భయం పోగొట్టడంతో పాటు వారి గౌరవ కాపాడటం, సత్వర న్యాయం అందించడమే పోక్సో కోర్టు సేవల ముఖ్య ఉద్దేశం. జిల్లా న్యాయ వ్యవహారాల పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సూచన మేరకు ఉమ్మడి కోర్టులో పోక్సో న్యాయస్థానం ప్రారంభించగా అదే తరహాలో మహబూబాబాద్, జనగామ జిల్లా కేంద్రాల్లోనూ తీర్చిదిద్దారు.