PM Modi Hyderabad Visit: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు.
పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్‌కు వెళ్తారు. అక్కడ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన బందోబస్తు, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠంగా చేస్తోంది.
ఇదీచూడండి: ap in Parliament: పోలవరం ముంపు బాధితుల్లో 1.64 లక్షల మంది గిరిజనులు