ఈ ఏడాది ప్రవేశాలు పొందిన పీజీ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నూతన జీవోలతో కౌన్సెలింగ్ నిర్వహించిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది. ఫీజుల తగ్గింపుతో కళాశాలలు నడపలేమని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో... దిక్కుతోచని విద్యార్థులు ప్రైవేటు వైద్య కళాశాలల ఎదుట ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
కళాశాలల్లో విద్యార్థులు చేరాల్సిన గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. గడువు తేదీని ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం... విద్యార్థులను చేర్చుకుంది. ప్రైవేటు వైద్య, దంత కళాశాలలకు సర్క్యులర్, మెమోలు ఇచ్చింది. ఫీజుల తగ్గింపుతో... ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. కళాశాలలు స్పందించకుంటే ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని విశ్వవిద్యాలయం కోరుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం గందరగోళానికి కారణమవుతోంది.
ఇదీ చదవండి: