ఏపీ వాణిజ్య పన్నుల ఎన్జీవో అసోసియేషన్ పేరును మార్చడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ వాణిజ్య పన్నుల ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ పురుషోత్తంనాయుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు.
సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా , ప్రభుత్వ ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పన్నుల ఎన్జీవో సంఘం పేరును ' ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్'గా మార్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. అసోసియేషన్ అనధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. సాధారణ పరిపాలన శాఖ , సహకార సంఘాల శాఖ ముఖ్యకార్యదర్శులు , ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్ , సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడికి నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను జూన్ 20 కి వాయిదా వేశారు
ఇదీ చదవండి: నెల్లూరులో తారాస్థాయికి అధికార పార్టీ 'ఫ్లెక్సీ' పాలిటిక్స్ !