ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్గా పెర్నాటి హేమ సుస్మిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి హాజరయ్యారు.
నెల్లూరులో వైకాపాకు నిబద్ధతతో పని చేసే హేమసుస్మితకు విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ పదవి ఇవ్వటం శుభపరిణామమని అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటి చైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. రాబోయో రోజులలో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇతర సేవలు అందించటంలో సంస్థ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
ఇదీ చదవండి: Sajjala: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసు: సజ్జల