ETV Bharat / city

ఆక్సిజన్‌ తయారీకి పరిశ్రమలకు అనుమతి - Oxygen shortage in AP News

కొన్ని పరిశ్రమల్లోని నైట్రోజన్‌ ప్లాంట్లను మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లుగా మార్చేందుకు అనుమతినిచ్చామని పీసీబీ తెలిపింది. వీటినుంచి ఎంత ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుందనేది ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేమని పీసీబీ ఛైర్మన్‌ ఏకే పరీడా తెలిపారు.

ఆక్సిజన్‌ తయారీకి పరిశ్రమలకు అనుమతి
ఆక్సిజన్‌ తయారీకి పరిశ్రమలకు అనుమతి
author img

By

Published : May 4, 2021, 11:23 AM IST

రాష్ట్రంలో కొన్ని పరిశ్రమల్లోని నైట్రోజన్‌ ప్లాంట్లను మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లుగా మార్చేందుకు అనుమతినిచ్చామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తెలిపింది. విశాఖపట్నంలోని అరబిందో ఫార్మా, దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, మెట్రోకెమ్‌ ఏపీఐ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైలాన్‌ లేబొరేటరీస్‌ పరిశ్రమలను మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పీసీబీ ఛైర్మన్‌ ఏకే పరీడా తెలిపారు. వీటినుంచి ఎంత ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుందనేది ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేమన్నారు.

శుద్ధి కేంద్రాలకు జీవ వైద్య వ్యర్థాలు...

కొవిడ్‌ ఆసుపత్రుల్లోని జీవ వైద్య వ్యర్థాలను ఇకపై ఆయా జిల్లాల్లోని కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ (సీబీఎండబ్ల్యూటీఎఫ్‌) కేంద్రాలకు అప్పగించాలని పరీడా సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్సనందించేందుకు అనుమతులున్న 240 ఆసుపత్రులూ వారి పేర్లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మొబైల్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వారి ఆసుపత్రుల్లో నుంచి ఉత్పన్నమయ్యే జీవవ్యర్థాలను ఆయా జిల్లాల్లోని సీబీఎండబ్ల్యూటీఎఫ్‌ కేంద్రాలకు అప్పగించాలన్నారు. యాప్‌లో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రతి కొవిడ్‌ ఆసుపత్రి ఒక నోడల్‌ అధికారిగా నియమించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ వ్యర్థాల్ని సేకరించకుండా చూడాలని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను కోరామన్నారు.

ఇదీ చదవండీ... రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.