ETV Bharat / city

వ్యాక్సినేషన్‌... ప్రజలకు తప్పని ఇక్కట్లు

రెండో డోసు వ్యాక్సినేషన్‌.. రాష్ట్రంలో అనేక ఇబ్బందుల మధ్య జరుగుతోంది. కేవలం రెండోడోసు తీసుకునే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినా.. ఇక్కట్లు తప్పడం లేదు. మొదటి డోసు ఇచ్చి 45 రోజుల పూర్తైన వారికి మాత్రమే టీకా ఇస్తామనటంతో.. గంటల కొద్దీ కేంద్రాల వద్ద ఎదురుచూసిన ఎంతోమంది.. నిరాశతో వెనుదిరిగారు. ముందే సమాచారం ఎందుకివ్వలేదని అధికారులను నిలదీశారు.

covid vaccination
కరోనా వాక్సినేషన్
author img

By

Published : May 12, 2021, 9:14 PM IST

వాక్సిన్ కోసం​ తిప్పలు

రాష్ట్ర వ్యాప్తంగా రెండో డోసు వ్యాక్సినేషన్‌.. అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతోంది. కేవలం రెండో డోసు తీసుకునే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినా ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. టీకా వేసుకునే వారికి స్లిప్పులు పంపిణీ చేయాలని.. ఎవరికి ఎప్పుడు.. ఎక్కడ.. వేస్తారో చెప్పాలని స్వయంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించినా.. అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నా.. ప్రజలు మాత్రం అడుగడునా పాట్లు పడుతున్నారు.

గందరగోళంగా టీకా పంపిణీ..

విజయనగరం జిల్లాలో మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన టీకా పంపిణీ గందరగోళంగా మారింది. మొదటి డోసు ఇచ్చి 45 రోజుల పూర్తైన వారికి మాత్రమే టీకా ఇస్తామనటంతో.. జనం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి గంటల తరబడి ఎదురుచూసినా.. ముందే సమాచారం ఎందుకివ్వలేదని నిలదీశారు. సాలూరు, పార్వతీపురం, రాజమహేంద్రవరం, నారాయణపురం వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ జనం నిరాశతో వెనుదిరిగారు. టీకా కేంద్రాలకు రప్పించి ఇబ్బందులు పెట్టడమేందని అధికారులను నిలదీశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీకాల్లేక కొంతమందికే వ్యాక్సిన్‌ వేశారు. తెల్లవారుజాము నుంచే టీకా కేంద్రాల వద్ద క్యూ కట్టిన జనాలు నిరాశతో వెనుదిరిగారు. అధికారుల పనితీరు వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్నిచోట్ల ప్రశాంతం..

పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో రెండో డోసు టీకా ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అధికారులు టీకా వేసుకునే వారికి ముందే.. ఎప్పుడు, ఎక్కడ వేసుకోవాలో వివరాలతో సహా స్లిప్పులు పంపిణీ చేయడంతో.. ఇబ్బందులు రాలేదు.

ఇదీ చదవండి:

బస్సులో ప్రాణవాయువు.. కొవిడ్ రోగులకు ఆయువు

పెద్ద కొడుకు చితి ఆరకముందే చిన్న కుమారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.