ETV Bharat / city

REVANTH REDDY:  మాజీ సీఎం రోశయ్యతో భేటీ అయిన రేవంత్ రెడ్డి - అమరావతి వార్తలు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్​ సీనియర్​ నేతలను కలుస్తూ వారి సూచనలు తీసుకుంటున్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్​ కొనిజేటి రోశయ్యతో భేటీ అయ్యారు.

Revanth Reddy
కొనిజేటి రోశయ్యను కలిసిన రేవంత్​ రెడ్డి
author img

By

Published : Jul 5, 2021, 5:00 AM IST

Updated : Jul 5, 2021, 12:18 PM IST

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ కురువృద్ధుడు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొనిజేటి రోశయ్య సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. రోశయ్య 88వ పుట్టిన సందర్భంగా ధరమ్‌కరమ్‌ రోడ్డులోని ఆయన ఇంటికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి, మాజీ పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కుసుమకుమార్‌ ఇతర నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నిండు నూరేళ్లు ఆయన వర్దిల్లాలని కోరుకుంటున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు. పదునైన భాషతో... ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే రోశయ్యగారి రాజకీయ విలువలు ఆదర్శమని పేర్కొన్న రేవంత్.. తాను ఆయన ఆశీర్వాదం సలహాలు, సూచనలు తీసుకోడానికి వచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్​ను అధికారం వైపు తీసుకెళ్లడానికి ఆయన సలహాలు, సూచనలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

WATER DISPUTE: తెలంగాణ విద్యుదుత్పత్తిపై హైకోర్టుకు ఏపీ రైతులు

Last Updated : Jul 5, 2021, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.