ETV Bharat / city

అగ్రిగోల్డ్ బాధితులకు 292.35కోట్లు చెల్లింపులు - అగ్రిగోల్డ్ తాజా వార్తలు

అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపులపై హైకోర్టులో.. సీఐడీ అధికారులు ప్రమాణ పత్రం దాఖలు చేశారు. గత నెల 30 నాటికి బాధితులకు 292.35 కోట్ల చెల్లింపులు పూర్తి చేశామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు 292.35కోట్లు చెల్లింపులు

author img

By

Published : Dec 5, 2019, 9:19 AM IST

గత నెల 30 నాటికి అగ్రిగోల్డ్ బాధితులకు 292 కోట్ల 35 లక్షల రూపాయలు అందజేసినట్లు సీఐడీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. డిపాజిటర్లకు న్యాయం జరిగేలా సీబీఐ విచారణకు ఆదేశించాలని, జీవో 31ని రద్దు చేయాలంటూ... అగ్రిగోల్డ్ ఫర్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆదేశాలతో సీఐడీ ప్రమాణపత్రం దాఖలు చేసింది.

10 వేలు.. అంతకన్నా తక్కువ సొమ్ము డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి 150 కోట్లు కేటాయించిందన్నారు. 10 వేల నుంచి 20 వేల రూపాయలలోపు ఉన్నవారికి 'అగ్రి' ఆస్తుల వేలం, విక్రయంతో వచ్చిన సొమ్మును చెల్లిస్తామని వివరించారు. అగ్రిగోల్డ్ అంశం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని, అక్కడున్న వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ కేసులో ఓ నిందితుడని సీఐడీ ప్రమాణపత్రంలో పేర్కొంది.

ఇదీ చదవండి

కియా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.