
ఇసుక అక్రమరవాణాను ప్రశ్నించిన వారిని పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన తమ పార్టీ నాయకుడు లోకేశ్ …. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. తాము ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదు అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు. లోకేశ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన సీఐ శ్రీరఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ధోరణిలో అక్రమాలపై పోరాడాలని శ్రేణులకు జనసేనాని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: