ETV Bharat / city

'మూడు రోజులైంది మా కొడుకును తీసుకెళ్లి.. ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో..?'

Secunderabad riots update: సికింద్రాబాద్​ అల్లర్ల ఘటనలో పాల్గొన్న పలువురు యువకులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే క్రమంలో మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న ఓ యువకుడి వివరాలు ఇప్పటికీ తెలియరాకపోవటంపై అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Secunderabad riots update
'మూడు రోజులైంది మా కొడుకును తీసుకెళ్లి.. ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో..?'
author img

By

Published : Jun 23, 2022, 9:56 AM IST

Secunderabad riots update : సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలంలోని దేవునిపల్లికి చెందిన చెన్నయ్య కుమారుడు మహేశ్​కుమార్‌ పాల్గొన్నాడంటూ అతడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. మహేశ్​ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మండల పరిధిలోని ఎలికట్టలో ఒక ఆర్మీ శిక్షణ సంస్థలో తర్ఫీదు పొందాడు. కానిస్టేబుల్‌ పరీక్ష కోసం షాద్‌నగర్‌లో నిర్వహించిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు.

అల్లర్లు జరిగిన రోజున కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఒత్తిడి మేరకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లొచ్చాడు. ఆ ఘటన అనంతరం.. సోమవారం పోలీసులు గ్రామానికి వచ్చి తమ కుమారుడిని తీసుకెళ్లారని మహేశ్​ తండ్రి తెలిపారు. మూడు రోజులైనా మహేశ్​ ఎక్కడున్నదీ తెలియడం లేదన్నారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే.. సికింద్రాబాద్​ అల్లర్ల ఘటనలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటికే 46 మందిని అరెస్ట్​ చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఆందోళన కార్యక్రమానికి ప్రణాళిక జరిగిందని గుర్తించిన పోలీసులు.. మొదటగా అడ్మిన్లుగా ఉన్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతంర ఆయా గ్రూప్​ల్లో విధ్వంసానికి సంబంధించిన సంభాషణలు చేసిన వివిధ ప్రాంతాల వారిని.. బుధవారం రాత్రి రైల్వే పోలీసులు స్టేషన్​కు తీసుకొచ్చి విచారణ చేశారు. ఈ​ అల్లర్లతో ప్రమేయం ఉన్న మరో 10 మంది నిందితులను గురువారం రోజు రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏ-2 పృథ్వీరాజ్​తో పాటు.. మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వీళ్లలో.. మహేశ్​కుమార్​ ఉన్నాడా..? లేడా..? అన్నది పోలీసులు తెలపాల్సి ఉంది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.