ETV Bharat / city

నాలుగో దశ ఎన్నికలకు.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - ఏపీ నామినేషన్ల వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో తొలిరోజు సర్పంచ్‌, వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఉత్సాహంగా నామ పత్రాలు దాఖలు చేశారు.

నాలుగో దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

author img

By

Published : Feb 10, 2021, 6:04 PM IST

నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు.

గుంటూరు జిల్లాలో ..

16 మండలాల పరిధిలోని 266 పంచాయతీలతో పాటు.. 2,810 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గుంటూరు రెవిన్యూ డివిజన్లో 19మండలాలు ఉన్నప్పటికీ... కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నందున తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను ఎన్నికల నుంచి మినహాయించారు. ఈనెల 12వ తేదితో నామినేషన్ల సమర్పణకు గడువు ముగుస్తోంది. 13వ తేదిన పరిశీలన, 14వ తేదిన అభ్యంతరాల స్వీకరణ, 15వ తేదిన అప్పీళ్లు- పరిష్కారం ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16వరకూ గడువిచ్చారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 21న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

ఉంగుటూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో తొలిరోజు సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. 81 పంచాయతీలు, 844 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

కర్నూలు జిల్లాలో..

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడేకల్ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కాగా.. అక్కడ నామినేషన్ వేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఓ అభ్యర్థి బంధువులు ఆరోపించారు. ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ,హోలగుందా, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

అనంతపురం జిల్లాలో..

పెనుకొండలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 112 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో పార్టీ.. షర్మిల వ్యక్తిగత ఆలోచన: కృష్ణదాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.