ETV Bharat / city

నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతోన్న నీటి ప్రవాహం - నాగార్జున సాగర్ జలాశయం

నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 566.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 248.29గా ఉంది.

nagarjunasagar-reservoir
nagarjunasagar-reservoir
author img

By

Published : Aug 16, 2020, 2:59 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 42,378 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి గత 20 రోజుల నుంచి నీటి ప్రవాహం నిలకడగా వస్తుండటం వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 566.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 248.29 టీఎంసీలకు చేరుకుంది. ఈ క్రమంలో అధికారులు 4,107 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి పీక్ అవర్స్​లో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు 40 టీఎంసీల నీరు సాగర్ జలాశయంలోకి వచ్చి చేరింది. మరో 30 టీఎంసీల నీరు చేరితే.. జలాశయం నిండుకుండలా దర్శనమివ్వనుంది. మరోవైపు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీచూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.