ETV Bharat / city

Amaravathi farmer paada yatra: మరింత జోరుగా మహాపాదయాత్ర.. అడుగడుగనా జన నీరాజనం - Prakasham district news

అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర.. ఇవాల్టికి ముగిసింది. యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద పాదయాత్ర ఆగింది. రైతులు ఇవాళ(శుక్రవారం), రేపు(శనివారం) అక్కడే బస చేయనున్నారు. రేపు విరామం దృష్ట్యా... తిరిగి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభం(sunday morning) కానుంది.

Amaravathi Raithu yatra
ఆంక్షల నడుమ.. పన్నెండో రోజు మహాపాదయాత్ర..
author img

By

Published : Nov 12, 2021, 9:21 AM IST

Updated : Nov 12, 2021, 8:07 PM IST

ఆంక్షల నడుమ.. పన్నెండో రోజు పాదయాత్ర

ప్రకాశం జిల్లాలో 12వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగిసింది. ముక్తినూతలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభమైన పాదయాత్ర యరజర్ల శివారులో ముగిసింది. ఒంగోలులో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్ నుంచి.. మంగమ్మ కళాశాల సెంటర్ జంక్షన్ వరకూ ఈరోజు పాదయాత్ర సాగింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌, బీసీ సంఘాలు, హైదరాబాద్‌లోని ఏపీ వాసులు సంఘీభావం తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సమదూరం ఉంటుంది. కాబట్టి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఘనస్వాగతం...

కాగా ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన రైతుల పాదయాత్ర పోలీసుల పహారా నడుమ కొనసాగింది. రైతులకు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలికారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాటనృత్యాలమధ్య పాదయాత్ర సందడిగా సాగింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. ఇవాళ్టి పాద యాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

రైతులపై లాఠీఛార్జ్...

ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర(amaravathi farmers padayatra).. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు.

వందల మంది పోలీసులు లాఠీలు(lotties) పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొడతారా.. కొట్టండి చూద్దాం

పాదయాత్రకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్న పోలీసులపై పలుచోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొడతారా! కొట్టండి చూద్దాం. మేమేమీ రాజకీయ విమర్శలు చేయడం లేదు. మద్యం, బిర్యానీ పొట్లాలు తీసుకుని రాలేదు. జై అమరావతి అన్న నినాదంతో దేవుడి దర్శనానికి వెళుతున్న రైతుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తియాత్ర. దీన్ని అడ్డుకోకండి’ అని ధ్వజమెత్తారు.

నిబంధనలకు విరుద్ధం : ప్రకాశం జిల్లా ఎస్పీ...

ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద రైతుల యాత్రలోకి నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేక దిశలో జనం చొచ్చుకు వచ్చారని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు. చొచ్చుకొచ్చిన ప్రజలను అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దాడి చేశారని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిలో తెదేపా రాష్ట్ర నేతలు కూడా ఉన్నారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతించిన వారే యాత్రలో పాల్గొనాలని ఎస్పీ తెలిపారు. మీడియావాళ్లు యాత్ర మొత్తం కవరేజ్ చేయాలని లేదని అన్నారు. మీడియా ప్రతినిధులు 3 పాయింట్ల నుంచే కవర్‌ చేయాలని చెప్పామని పేర్కొన్నారు. ఐకాస సభ్యులు మీడియాతో మాట్లాడానికి అభ్యంతరం లేదన్నారు. కోర్టు అనుమతి ప్రకారమే రైతుల పాదయాత్ర సాగాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Nov 12, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.