ETV Bharat / city

Telangana: నీళ్లు అనుకుని.. యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి - తెలంగాణ 2021 వార్తలు

ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు.. మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్‌ తాగి మృతిచెందింది. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

old woman died after drinking acid as she felt water in the hospital in nizamabad district
నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి
author img

By

Published : Jul 23, 2021, 3:21 PM IST

నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు.. మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్‌ తాగి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకి దిగారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు గురై ఖలీల్వాడీలోని జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన జడల సాయమ్మ బాధితుడికి పెద్దమ్మ వరస అవుతుంది. జయమ్మ అతన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. దాహం వేయగా.. అక్కడ ఓ సీసా కనపడింది. అవి మంచినీళ్లనుకొని వెంటనే తాగేసింది.

ఈమెకు ట్రీట్​మెంట్ జరిగి ఏం చనిపోలేదు. నీళ్లనుకొని యాసిడ్ తాగడం వల్లనే ఈమె చనిపోయింది. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడితే.. ఆయనకు తోచింది ఏమన్న చేస్తా అన్నడు. మేమూ సరే అన్నం. పాము కరిచి చికిత్స పొందుతున్న అతనికి ఫ్రీ ట్రీట్​మెంట్ ఇస్తమన్నరు. ఇగ మేమూ బలవంతమేం చేయలే. - మృతురాలి బంధువు

కానీ అది యాసిడ్ కావడంతో సాయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సాయమ్మ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చివరకు పాముకాటుతో చికిత్స పొందుతున్న బాధితుడికి ఉచితంగా చికిత్స చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు.

ఇదీ చూడండి: NGT: రాయలసీమ ఎత్తిపోతలపై తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.