ETV Bharat / city

పది పరీక్షలకు కసరత్తు.. భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించేలా చర్యలు - tenth class exams in ap

కరోనా వల్ల పిల్లల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు పరీక్షలు పెడతారో అని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎదురుచుస్తున్నారు. అటువంటి వారికే ఈ వార్త పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ఇంకా స్పష్టత లేకపోయినా అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

officials planning to conduct tenth exams
పది పరీక్షలకు కసరత్తు
author img

By

Published : Apr 30, 2020, 10:16 AM IST

ఇప్పటికే పూర్తికావాల్సిన పది పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎప్పుడు నిర్వహించేది ఇంకా స్పష్టత లేకపోయినా అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్వహించడానికి సన్నద్ధమౌతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. గతంలో పరీక్షలు నిర్వహించనున్న కేంద్రాలు భౌతిక దూరం పాటించేలా కావాల్సిన వసతులు తదితర అంశాల వారీగా వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు.
బల్లకు ఒకరు

ఇంతకు ముందు పరీక్షల నిర్వహణకు 279 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో అవసరమైన ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలంటే బల్లకు ఓ విద్యార్థి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంతకుముందు బల్లకు ఇద్దరు ఉండేవారు. జిల్లాలోని ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉన్న తరగతి గదులను బట్టి ఒక్కో గదిలో 8 నుంచి 12 బల్లలు పడతాయని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు నివేదించారు.

మరిన్ని కేంద్రాలు అవసరం

బల్లకు ఒక విద్యార్థి చొప్పున కేటాయించి తగు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాల్సి వస్తే మరిన్ని కేంద్రాలు అవసరం అవుతాయని మండలాల వారీగా సేకరించిన నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడటం వారు చదువుతున్న తీరును తెలుసుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు తయారు చేశారు. పది పరీక్షలకు ఆదేశాలు రాగానే నిర్వహించేలా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా కసరత్తు చేస్తుంది.
ముందస్తు ఏర్పాట్లు
పది పరీక్షలు ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించినా సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని డీవైఈవో సుబ్బారావు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఇంకా ఎన్ని కేంద్రాలు అవసరమౌతాయనేది మండలాల వారీగా వివరాలు సేకరించామని అన్నారు. వచ్చిన నివేదికలను బట్టి గతంలో కేటాయించిన వాటికి రెట్టింపు కేంద్రాలు అవసరమౌతాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలతో అవసరమైన అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇది చదవండి లాక్​డౌన్​ కాలంలో మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.