ETV Bharat / city

పోలవరం మాటే లేదు.. నిధుల కేటాయింపులో మళ్లీ నిర్లక్ష్యం! - ఏపీలో పోలవరం ప్రాజెక్టు వార్తలు

జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ నాబార్డు నుంచి చాలినంత రుణం మాత్రం అందడంలేదు. 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక కేంద్రం ఇంతవరకు రూ.10,741 కోట్లు మాత్రమే ఇచ్చింది. మరోవైపు ఏడాదికి 2వేల కోట్లకు మించి కేంద్రం నిధులివ్వడం లేదు. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

polavaram
polavaram
author img

By

Published : Feb 2, 2021, 1:44 PM IST

పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ నాబార్డు నుంచి చాలినంత రుణం అందడం లేదు. కేంద్ర బడ్జెట్‌లోనూ కేటాయింపులు చూపడం లేదు. తాజాగానూ నిరాశే ఎదురైంది. 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక కేంద్రం ఇంతవరకు రూ.10,741 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2017-18 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.55,656.87 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరోవైపు ఏడాదికి 2వేల కోట్లకు మించి కేంద్రం నిధులివ్వడం లేదు. దీనివల్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్న వినిపిస్తోంది.

* 2017-18 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి రావాల్సిన నిధులు: 51,005.96 కోట్లు
* జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు ఖర్చు: 4,730.71 కోట్లు
* రావాల్సిన నిధులు: 46,365.25 కోట్లు
* జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక కేంద్రం ఇచ్చిన నిధులు: 10,741.46 కోట్లు
* ఇంకా అవసరమైన నిధులు: 35623.79 కోట్లు
* రాష్ట్రం ఖర్చు చేసి ఇంకా కేంద్రం నుంచి రావాల్సినవి: 1,652.02 కోట్లు
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది: 1,850 కోట్లు
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది: 2234.22 కోట్లు

పోలవరానికి మూడేళ్లలో రూ.5,484 కోట్లు

పోలవరం ప్రాజెక్టుకు మూడేళ్లలో రూ.5,484.29 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2018-19లో రూ.1,400 కోట్లు, 2019-20లో రూ.1,850 కోట్లు, 2020-21లో రూ.2,234.29 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: కుదేలైన దేశానికి ఆర్థిక టీకా- ఏ రంగానికి ఎంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.