తెలుగుమాట్రీమోనీలో ఓ యువతిని మోసం చేసిన నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (HYDERABAD CYBER CRIME POLICE) అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో (TELUGU MATRIMONY) ప్రొఫైల్ పెట్టారు.
ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ (NIGERIAN) తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ (PROFILE) చూసి నచ్చిందని వల వేశాడు. అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మాటలు కలిపాడు. భారత్ రావడానికి వీసా (BHARAT VISA) కోసం గుజరాత్‌లో (GUJARATH) ఇల్లు కొన్నానని నమ్మించాడు. ఇంటి మరమ్మతు కోసం పలు దఫాలుగా రూ.10 లక్షలు అకౌంట్‌లో జమ చేయించుకున్నాడు.
అనంతరం నైజీరియన్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నైజీరియన్‌ను దిల్లీలో (DELHI) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: