గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 46, గుంటూరు జిల్లాలో 39, అనంతపురంలో 22, చిత్తూరులో 44, తూర్పుగోదావరిలో 26, కడపలో 14, కర్నూలులో 26, నెల్లూరులో 23, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 12, విశాఖలో 25, విజయనగరం 5, పశ్చిమగోదావరిలో 27 మందికి సొకినట్టుగా అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 84 వేల490 కు చేరింది. ఇప్పటివరకు 7,127 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 308 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,832 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు.