తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పక్కనే ఉన్న ముత్తూరు ప్రాంతానికి చెందిన కీర్తివాసన్(20) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కీర్తివాసన్ ఇటీవలే నీట్ ప్రవేశ పరీక్ష రాశాడు. అయితే ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న క్రమంలో ఫెయిల్ అవుతానన్న భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కీర్తివాసన్ 12వ తరగతి పూర్తి చేసి నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు మూడుసార్లు నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన అతను.. ఇటీవలే నాలుగోసారి పరీక్ష రాశాడు. పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. నీట్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని.. ఈసారి కూడా ఫెయిల్ అయే అవకాశం ఉందని తరచూ బాధపడేవాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో అక్టోబర్ 29 సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. స్థానికుల సాయంతో కీర్తివాసన్ను మొదట పొల్లాచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఇదీ చదవండి: GUTKA CAUGHT: ధాన్యం బస్తాల మధ్య గుట్కా తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు