పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిపలక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఉపాధి, నివాసం ఎప్పుడు చూపుతారని ప్రశ్నించారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 30వ తేదీ గవర్నర్ ను కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అప్పటికి ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 5 తేదీ నాడు దిల్లీలో ధర్నా చేపడుతామని హెచ్చరించారు
ఇదీ చదవండీ.. BOMBS: వెదురుకుప్పంలో నాటు బాంబుల కలకలం.. ముగ్గురు అరెస్ట్