ETV Bharat / city

బ్యుటీషియన్‌ క్లినిక్‌లపై అప్రమత్తంగా ఉండండి.. జాతీయ వైద్య మండలి - NMC advised beautician clinics to be vigilant

NMC Advised Beautician Clinics To Be Vigilant: హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి  40 ఏళ్లకే బట్టతల వచ్చేసింది. టీవీల్లో, పత్రికల్లో వస్తున్న ఆకర్షణీయ ప్రకటనలు చూసి ఒక బ్యుటీషియన్‌ క్లినిక్‌ను మిరుమిట్లు గొలిపే కాంతులతో కళకళలాడుతున్న అక్కడి వాతావరణాన్ని చూసి చికిత్సకు సిద్ధమయ్యాడు. ఫీజు రూ.2 లక్షలు చెల్లించాడు. బట్టతలపై వెంట్రుకలు నాటే చికిత్స పొందిన రెండురోజులకే అతడికి జ్వరం వచ్చింది. క్లినిక్‌ వారు ఇచ్చిన మాత్రలు వారం రోజులు వాడినా ఎంతకీ జ్వరం తగ్గకపోగా.. తీవ్రమైన తలపోటుతో విలవిల్లాడాడు. హుటా  హుటిన ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. వెంట్రుకలు నాటినచోట ఇన్​ఫెక్షన్‌  రావడంతో ఈ సమస్యలు తలెత్తాయని వైద్యులు గుర్తించారు. మరికొద్దిరోజులు గడిస్తే ఇన్‌ఫెక్షన్‌ ఒళ్లంతా వ్యాపించి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తేవని వారు బాధితుడికి తెలిపారు.

national medical council
national medical council
author img

By

Published : Oct 17, 2022, 1:30 PM IST

NMC Advised Beautician Clinics To Be Vigilant: బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తాం.. ఆపరేషన్‌ లేకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తాం.. ముఖంపై మచ్చలు, గుంతలను ఇట్టే మాయం చేస్తాం..’ ఇలాంటి ప్రచార ప్రకటనలు చూసి ఆకర్షితులవుతున్నారా? జాగ్రత్త.. ఇందులో మోసపోయే అవకాశాలెక్కువగా ఉన్నాయని స్వయంగా జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. ముఖ్యంగా ‘హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’కు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. ఒక వెంట్రుకకు ‘ఇంత’ అని ధర నిర్ణయిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

బరువు తగ్గించే చికిత్స పేరిట కూడా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై ఇటీవల డెర్మటాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యుల సంఘాలు ప్రభుత్వానికి, జాతీయ వైద్యమండలికి ఫిర్యాదు చేశాయి. దీనికి స్పందించిన వైద్యమండలి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అనర్హులు ఈ తరహా చికిత్సలు చేస్తే చట్టపరమైన నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

..

లాభసాటి వ్యాపారం: గత దశాబ్దకాలంలో బ్యుటీషియన్‌ క్లినిక్‌ల పేరిట అనేకమంది ఈ రంగంలో అడుగుపెట్టారు. వైద్యపరమైన అర్హతలు లేకపోయినా అందానికి మెరుగులు దిద్దే చికిత్సలు చేసేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి, అక్కడక్కడా శిక్షణ పొంది, విదేశాల్లో ఫెలోషిప్‌ చేసొచ్చామని చెబుతూ.. వ్యాపారం చేస్తున్నారు. చివరకు హెయిర్‌ సెలూన్లలో కూడా ఇలాంటి చికిత్సలు చేసేస్తున్నారు. లాభసాటి వ్యాపారంగా మారడంతో చాలా మంది అనర్హులు ఇందులోకి ప్రవేశిస్తున్నారు.

దీనిపై వైద్యాధికారులు దృష్టిపెట్టకపోవడంతో పుట్టగొడుగుల్లా క్లినిక్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో చికిత్స వల్ల అనారోగ్య సమస్యలు, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్దికాలం కిందట హైదరాబాద్‌లో అనర్హుల వద్ద హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స పొందిన ఒక వ్యక్తికి ఇన్‌ఫెక్షన్‌ అధికమై ప్రాణాలు కోల్పోయాడని నిపుణులు ఉదహరిస్తున్నారు.

ఎన్‌ఎంసీ తాజా మార్గదర్శకాలివీ..

* ఐసీయూ సౌకర్యం ఉన్న ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయొచ్చు. డే కేర్‌ సెంటర్‌లో చేయాల్సి వచ్చినా.. అక్కడ వెంటిలేటర్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలి.

* ఈ చికిత్సల్లో శిక్షణ పొందిన నర్సులు, ఆపరేషన్‌ థియేటర్‌కు చెందిన సాంకేతిక సహాయకులుండాలి.

* మత్తుమందు ఇవ్వడం తప్పనిసరి కాబట్టి.. దీనికి సంబంధించిన పరికరాలుండాలి.

* రోగి కోలుకునే వరకూ మత్తు వైద్యుడి సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండాలి.

* అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు వైద్యపరంగా మెరుగైన వసతులున్న మరో పెద్దాసుపత్రితో ముందస్తు ఒప్పందం కుదుర్చుకోవాలి.

* వైద్యుల అర్హతతో పాటు తమ వద్ద ఎటువంటి సౌకర్యాలున్నాయనేది ఆసుపత్రిలో ప్రదర్శించాలి.

శాస్త్రీయ చికిత్స ముఖ్యం: అందానికి మెరుగులుదిద్దే చికిత్సలు రెండు రకాలు. ఔషధాల ద్వారా మాత్రమే నయం చేసేవి, శస్త్రచికిత్సతో కూడినవి. ఔషధాలతో చికిత్సలను డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్‌ సర్జన్లు చేయాలి. శస్త్రచికిత్సలు మాత్రం ప్లాస్టిక్‌ సర్జన్లు మాత్రమే చేయాలి. బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ప్రక్రియను డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్‌ సర్జన్లూ ఇరువురూ చేయొచ్చు. అంతేగానీ బీఏఎంఎస్‌ వైద్యులు, డిప్లొమా కోర్సులు చేసినవారు, ఎంబీబీఎస్‌, దంతవైద్యులు, ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ, గైనకాలజీ సహా ఇతర స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులెవరూ ఈ తరహా చికిత్సలు చేయడానికి వీల్లేదని తాజాగా జాతీయ వైద్యమండలి స్పష్టం చేసింది. కంటి చుట్టూ ముడతలకు ఆఫ్తల్మాలజిస్టులు కూడా చికిత్స చేయొచ్చు. - డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, సీనియర్‌ డెర్మటాలజిస్ట్‌

సౌందర్యానికి చికిత్సలు ఎన్నెన్నో...

* బట్టతలపై వెంట్రుకలను నాటడం (ట్రాన్స్‌ప్లాంటేషన్‌)

* ముక్కు పొడుగ్గా ఉన్నా.. సన్నగా ఉన్నా.. నొక్కినట్లుగా ఉన్నా.. దాన్ని సరిచేయడం

* కంటి చుట్టూ, ముఖంపై ముడతలను ఇంజక్షన్లు ఇచ్చి సరిచేయడం

* మొటిమల వల్ల వచ్చే మచ్చలు, గుంతలను కొవ్వుతో పూడ్చడం, సర్జరీ చేయడం

* దవడలు, గడ్డాన్ని తీర్చిదిద్దడం

* రొమ్ముల సైజును పెంచడం, తగ్గించడం

* పొట్ట చుట్టూ కొవ్వును లైపోసక్షన్‌ ద్వారా తీసేయడం.

* తొడలు, పిరుదుల వద్ద కొవ్వును సర్జరీ చేసి తొలగించడం

* ముఖంపై సీతాకోక చిలుక మాదిరిగా చారలు ఏర్పడితే తీసేయడం

* సూర్యకిరణాల దెబ్బకు చర్మంపై ఏర్పడే తెల్ల మచ్చలను తొలగించడం.

అనర్హులతో వైద్యం చేటే: ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలుంటాయి. ఈ చికిత్సల విషయంలో భయపడాల్సిన పనిలేదు. అర్హులైన వైద్యులతో చికిత్స పొందితే 99 శాతం ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు. అతి కొద్దిమందిలో సమస్యలు ఎదురైనా నిపుణులైన వైద్యుల సమక్షంలో చికిత్స జరుగుతుంది కనుక.. వెంటనే చక్కదిద్దవచ్చు. అలా కాకుండా వ్యాపారవేత్తలు, బ్యూటీషియన్లు నిర్వహించే క్లినిక్‌లలో సమస్యలు తలెత్తితే.. వెంటనే చక్కదిద్దే అవకాశం ఉండదు. తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలెక్కువ. - డాక్టర్‌ వైవీ రావు, సీనియర్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.