నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత ఆధిక్యంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యం సాధించారు.
ఏడో బ్యాచ్ ముగిసేసారికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి (తెరాస)కి 1,10,840 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, కోదండరామ్ (తెజస)కు 70,072 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) 39,107 ఓట్లు, రాములు నాయక్ (కాంగ్రెస్) 27,588 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 21, 636 చెల్లబాటు కాలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లతో ఎవరికి పోలైన ఓట్లలో సగానికి పైగా రాకపోవడంతో.. ఫలితం తేలలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు తప్పనిసరైంది. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేసి లెక్కింపు ప్రారంభించారు.
ఇదీ చదవండి: సేంద్రీయ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి : నాబార్డు ఛైర్మన్