నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,826 పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా యూనిట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. మొత్తం రూ. 781 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. 664 మండలాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా యూనిట్ల నిర్మాణం కోసం నాబార్డు సహకారం అందించనుంది. గ్రామీణ మౌలిక సదుపాయల అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ నిధులు మొత్తం నాబార్డు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 137 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
ఇవీ చదవండి..
బాబాయ్ కోసం ప్రార్థించిన అందరికి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు